దళితులను మోసం చేస్తున్న పార్టీ బీజేపీ- మంత్రి కొప్పుల

85
- Advertisement -

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్‌లో గెలిచిన ఈటెల రాజేందర్ నిన్న,‌ మొన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మండిపడ్డారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. శుక్రవారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. మంత్రితో పాటు ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు సమావేశంలో ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. దళిత బంధు వెంటనే అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేయడం హాస్యాస్పదం,దళిత బంధు దేశంలోనే కేసీఆర్ ఆలోచనతో తెలంగాణలో మొదలైన పథకం, దళిత బంధు అమలు మొదలయింది. ఎన్నికల సమయంలో బీజేపీ పిర్యాదు వల్లే ఆగింది. బీజేపీ పార్టీ, బండి సంజయ్ చెబుతేనో మొదలు పెట్టిన పథకం దళిత బంధు కాదు,‌బండి సంజయ్‌కు దళిత బంధుపై మాట్లాడటానికి ఏం అర్హత ఉందని మంత్రి ప్రశ్నించారు. కేంద్రం నుంచి దళితులకు ఏం తెస్తారో బండి సంజయ్ చెప్పాలి, దమ్ముంటే బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకం పెట్టించాలి, బీజేపీ నేతలు అబద్దాలతో మభ్యపెడుతున్నారు అని మండిపడ్డారు.

దళితులను మోసం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ హుజురాబాద్‌లో ఏక్కడ లేని విధంగా బీజేపీ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది, ముందు ఆ మేనిఫెస్టోను అమలు చేసేందుకు బండి సంజయ్ కేంద్రంతో కొట్లాడాలి. ఉపఎన్నికలకు కూడా మేనిఫెస్టో విడుదల చేస్తారా! ఉన్నత వర్గాలకు ఆదానీ అంబానీలు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ అయితే పేదల కోసం పని చేసే పార్టీ టీఆర్ఎస్,‌ బీజేపీ ఎంపీ అరవింద్ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ చట్టాన్ని లొట్టపీసు చట్టం అంటూ హేళన చేశారు. దళిత జాతిని అవమాన పరిచిన ఎంపీ బీజేపీలో ఉన్నారు. దళితులంటే అరవింద్ కు చిన్న చూపా అని మంత్రి దుయ్యబట్టారు.

కాంగ్రెస్ బీజేపీలు బాహాటంగా సహకరించుకోవడం వల్లే హుజురాబాద్‌లో ఓటమి పాలయ్యాం, కానీ తెరాస పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు, బీజేపీ దేశ వ్యాప్తంగా 32 ఉప ఎన్నికలు జరిగితే ఒక ఎంపీ 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్‌తో అనైతిక పొత్తుతో గెలిచిన రాజేందర్ విర్రవీగి మాట్లాడుతున్నారు. రాష్ట్ర నాయకుడిలా రాజేందర్ మాట్లాడుతున్నాడు రాజేందర్ రాష్ట్ర మంతా తిరిగితే బండి సంజయ్ లక్ష్మణ్ ఏం కావాలి, అసలు రాజేందర్ చివరి దాకా బీజేపీలో ఉంటారా అనేది అనుమానమే. రాజేందర్ ఆయానంతట ఆయనే టీఆర్ఎస్‌ను వీడి వెళ్లారు, ఎక్కువగా ఊహించుకుని రాజేందర్ మాట్లాడుతున్నారు అని మంత్రి వ్యాఖ్యనించారు.

హుజురాబాద్ ఫలితంపై పార్టీలో తప్పక సమీక్ష చేసుకుంటాం,‌ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల గడువు ఉంది. హుజురాబాద్‌లో మా ఓటమికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధం లేదు, అక్కడ ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు మానాలి. పెట్రోల్ డీజిల్ ధరలు వంద రూపాయలు దాటించి కేవలం ఐదు రూపాయలు కేంద్రం తగ్గిస్తే ఫలితం ఏమిటీ, బీజేపీ నేతలు అబద్ధాలను మాని కేంద్రం ద్వారా రాష్ట్రానికి ఉపయోగ పడే పనులు చేయాలి. కాంగ్రెస్ పార్టీలో హుజురాబాద్ ఫలితం చిచ్చు రేపుతోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఈటలతో కుమ్మక్కు కావడాన్ని కాంగ్రెస్ సీనియర్లు తప్పు పడుతున్నారు, కాంగ్రెస్ బీజేపీల నీతి బాహ్యపు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్ఎస్‌కు ఉపఎన్నికలు విజయాలు అపజయాలు కొత్తకాదు అని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -