- Advertisement -
కరోనాపై పోరులో నిర్వీరామంగా సేవలు అందించిన డాక్టర్లపై ప్రశంసలు గుప్పించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. వైద్యాధికారుల సేవలు అనిర్వచనీయమని తెలిపారు. ఐఎస్‌ఎం ఎడ్యుటెక్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అతిథిగా హాజరైన కొప్పుల డాక్టర్లు, నర్సులు సేవాతత్పరతతో వైద్యసేవలు అందించి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు.
సమాజాన్ని పట్టిపీడిస్తున్న కొవిడ్ -19 మహమ్మారిని తరిమికొట్టడంలో వైద్య సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సంస్థ ద్వారా విదేశాలలో ఎంబీబీఎస్ అభ్యసించిన యువ డాక్టర్లు తమ స్వస్థలాలకు తిరిగి వచ్చి అంకితభావంతో రోగులకు సేవలందించడాన్ని మంత్రి ప్రశంసించారు.
- Advertisement -