రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆశ్చర్యనికి గురయ్యే పథకాలను అమలు చేస్తోందన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. ఇటీవల జగిత్యాల మున్సిపాలిటీ శంకుస్థాపన చేసి డంపింగ్ యార్డ్ వద్ద FSTP ప్లాంట్ ను ప్రారంభించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
నూకపెళ్లిలో డబల్ బెడ్రమ్ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారంటే సరే అనుకున్న కానీ ఇంత అద్భుతంగా 4500 ఇల్లు నిర్మాణం చేపడ్తున్నారాని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు మంత్రి. దాదాపు అన్ని ఇల్లు నిర్మాణం పూర్తి కావస్తోందని చూస్తుంటే తెలుస్తుందన్నారు. ఇదంతా ఎమ్మెల్సీ కవిత కృషితోనే జరిగింది ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఆశ్చర్యనికి గురయ్యే పథకాలను అమలు చేస్తోందన్నారు. జగిత్యాల జిల్లా కావడం మన అదృష్టం, తెలంగాణ రాష్ట్ర ఏర్పడంతో జిల్లాగా ఏర్పడి జిల్లా కేంద్రం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు మంత్రి.
కలెక్టరేట్‌ను చూస్తే వేరే రాష్ట్రాలలో సచివాలయం లాగా కనబడుతోందన్నారు మంత్రి. జిల్లాకి కేంద్రంలో మెడికల్ కాలేజీ మంజూరైంది, ఇప్పుడు మనం జిల్లాని దాటి వేరే ప్రాంతానికి మెడికల్ డిగ్రీ చదవడానికి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అధునాతన మార్కెట్లు ఏర్పాటు చేస్తోంది, రోడ్ల వెడల్పు, డ్రైనేజీలు, చెరువులు, ఇంకా మన ఊరు మన బడి కార్యక్రమం ఎంతో గొప్ప పతకంగా ఉందన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ గొప్పతనం. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వం సహకారం లేని ఇల్లు లేదని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు అన్నారు. ఇంకో సంవత్సరం కాలంలో ఈ కేసీఆర్ కాలనిలో ఇళ్ల పంపిణీ చేస్తామని, మౌలిక వసతులు కల్పించి అందిస్తామని, తన వంతుగా కూడా సహకారం అందిస్తామని మంత్రి కొప్పుల తెలిపారు.