దివ్యాంగుల సలహా మండలి రాష్ట్ర స్థాయి మొట్టమొదటి సమావేశం గురువారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో జరిగింది. ఈ సమావేశానికి మండలి ఛైర్మన్ హోదాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, ప్రభుత్వ విప్ గొంగడి సునీత,మండలి సభ్యులైన దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ఛైర్మన్ డాక్టర్ వాసుదేవ రెడ్డి,ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ,మహిళా, శిశు,దివ్యాంగుల సంక్షేమ శాఖల ప్రత్యేక కార్యదర్శి దివ్యా దేవరాజన్,దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ డైరెక్టర్ శైలజ,పలు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, సంఘాల నాయకులు హాజరై తమ అమూల్యమైన సలహాలు ఇచ్చారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ సంక్షేమ,శ్రేయో రాష్ట్రంగా ముందుకు సాగుతున్నది. దివ్యాంగులతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమం,భద్రత, అభ్యున్నతికి కెసిఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నరు. సంక్షేమం, అభివృద్ధి అంశాలలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి ఆదర్శంగా,చిరునామాగా మారిందన్నారు. మనమందరం తెలంగాణ బిడ్డలుగా పుట్టడం అదృష్టం అని మంత్రి తెలిపారు.దివ్యాంగుల సంక్షేమానికి ప్రతి ఏటా 64 కోట్లు ఖర్చు చేస్తున్నం. సుమారు 5 లక్షల మంది దివ్యాంగులకు 3వేల16 చొప్పున నెలా నెల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఈ సందర్భంగా మండలి సభ్యులు,స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, సంఘాల నాయకులు ఇచ్చిన అమూల్యమైన సలహాలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకుపోతామన్నారు. ప్రజల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే గొప్ప మానవతామూర్తి కెసిఆర్ దివ్యాంగులకు మరింత చేస్తారు.దివ్యాంగులకు విశేష సేవలందిస్తున్న సంస్థలను దత్తత తీసుకునే ఆలోచన ప్రభుత్వానికి ఉంది.ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న అత్యుత్తమ పథకాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, కెసిఆర్ దృష్టికి తెచ్చి మరింత మేలు జరిగేలా చూస్తా అని మంత్రి అన్నారు.