ప్రభుత్వం జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టింది- మంత్రి కొప్పుల

431
Minister Koppula Eshwar
- Advertisement -

ప్రభుత్వం జనరంజక బడ్జెట్ ప్రవేశపెట్టిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇది అన్ని వర్గాల ప్రజలకు మరింత మేలు చేసేదిగా ఉంది..సీఎం కేసీఆర్‌ దళిత్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రాంను కొత్తగా ప్రవేశపెట్టి 1,000కోట్ల రూపాయలు కేటాయించడం హర్షనీయం అన్నారు. దళితులు, మైనారిటీల భద్రత,సంక్షేమం, అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంకితభావంతో ముందుకు సాగుతున్నారని చెప్పడానికి ఇదొక తాజా నిదర్శనమని మంత్రి కొనియాడారు.

సీఎం కేసీఆర్‌ 2021-21బడ్జెట్‌లో ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం 21వేల306కోట్ల 85లక్షలు కేటాయించారు. 2020-21లో ఇది 16వేల 534కోట్లు.. 2021-21ఆర్థిక సంవత్సరంలో అదనంగా 4వేల772కోట్లు కేటాయించారు. జనాభా ప్రాతిపదికన 15.45%( 19వేల509కోట్లు)ఇవ్వాల్సి ఉండగా,16.87%శాతం కేటాయించారు. అంటే ఇది 1.4%శాతం అదనం అని మంత్రి తెలిపారు.

2021-22లో మైనారిటీల సంక్షేమానికి 1,606కోట్లు కేటాయించారు. 2020-21లో1,518కోట్లు.. ఇది గతం కంటే 88కోట్లు అదనం. ఈవిధంగా బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడం పట్ల హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు,వారి పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు మంత్రి కొప్పుల ఈశ్వర్.

- Advertisement -