చిన్నారికి మంత్రి కొప్పుల ఆపన్న హస్తం..

130
Minister Koppula Eshwar
- Advertisement -

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతూర్తి గ్రామానికి చెందిన 9 సంవత్సరాల గొట్టె అక్షయ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. అయితే చికిత్స చేయించలే పరిస్థితిలో ఉన్న పాప తల్లిదండ్రులుసంక్షేమ శాఖ మంత్రి కొప్పులను కలవడం జరిగింది. వీరిది నిరుపేద కుటుంబం రెక్కాడితేనే దొక్కాడే పరిస్థితి, వారి ఆర్థిక పరిస్థితి గమనించి మంత్రి అమ్మాయి చికిత్స కోసం పెద్ద మనసుతో సాయం అందించారు.

హైదరాబాద్‌లో బసవతారకం హాస్పిటల్ డాక్టర్ లతో సంప్రదించి, అడ్మిట్ చేయించి, మెరుగైన వైద్యానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయంగా 4 లక్షల రూపాయల చెక్కును చిన్నారి తండ్రి లక్ష్మి నారాయణకు శుక్రవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ అందించారు. ఈ సందర్భంగా చిన్నారి అక్షయ కుటుంబ సభ్యులు మంత్రికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలపారు..

- Advertisement -