పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గోదావరి తీరంలో గోదావరి మాతాకి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషి వల్లనే గోదావరి నీళ్ళతో తెలంగాణ బీడు భూములను సాగుభూములుగా మారాయి. 40 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే మహా సంకల్పాన్ని సీఎం కేసీఆర్ వల్లనే సాధించినం. అని అన్నారు.
జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ.. మరికోద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు నీళ్ళు ఇవ్వబోతున్నం.సీఎం కేసీఆర్ పూజలు చేసి పంపుహౌస్‌ను ప్రారంభిస్తే.. నీళ్ళు వస్తలేవని చెప్పిన బిజేపి నాయకులు రఘునందన్ రావు ఒక సారీ కన్నెపల్లి పంపుహౌస్‌కు వచ్చి చూడాలన్నారు. రీ డైజినింగ్ ద్వారా ఎంతో మంది రైతులకు నీరివ్వబోతున్నం. తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధిలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు.