- Advertisement -
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన 56 మందికి రూ.56,06496 విలువగల కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ: ఆడపిల్లల తల్లికే కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకుడదన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి పేదలకు అండగా నిలుస్తుందన్నారు.

అలాగే కాన్పు సమయంలో అంగన్ వాడీల ద్వారా పాలు, గుడ్లు, మంచి భోజనాన్ని గర్భిణీ స్త్రీలకు పోషకాహార రూపంలో అందజేస్తున్నామని,ప్రసవ సమయంలో ప్రభుత్వాసుపత్రికి వస్తే పన్నెండు వేల రూపాయలు, కేసీఆర్ కిట్, అందజేస్తున్నామన్నారు..ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు.
- Advertisement -

