కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం MPDO కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు రూ. 31,03,596 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది. నిరుపేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని మంత్రి అన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని.. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అని తెలిపారు. రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత గారు, MPP కూనమల్లలక్ష్మి లింగయ్య గారు, వైస్ MPP ముస్కు కవిత దేవేందర్ రెడ్డి గారు, PACS ఛైర్మన్ రాంరెడ్డి గారు,స్థానిక MPTC పెద్దూరి హారిక భరత్ గారు, తదితరులు పాల్గొన్నారు.