కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల..

206
Minister Koppula Eshwar
- Advertisement -

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు 62,57,308 లక్షలను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల తల్లికే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఇస్తున్నాం అన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకుడదన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తుందన్నారు.

అలాగే కాన్పు సమయంలో‌ అంగన్ వాడీల‌ ద్వారా పాలు, గుడ్లు, మంచి భోజనాన్ని గర్భిణీ స్త్రీలకు పోషకాహార రూపంలో అందజేస్తున్నామని ప్రసవ‌ సమయంలో ప్రభుత్వాసుపత్రికి‌ తెస్తే పన్నెండు‌‌ వేల రూపాయలు, కేసీఆర్ ‌కిట్, అందజేస్తున్నామన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పేరులు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దన్నారు ఎవరి ద్వారా మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌.

- Advertisement -