- Advertisement -
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ధర్మపురి మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు 11, 89,500 రూపాయలు అలాగే బుగ్గారం మండలానికి చెందిన 29 మంది లబ్ధిదారులకు 10,33,500 రూపాయల విలువగల చెక్కులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనేకమంది పేద ప్రజలు డబ్బులు లేక ఆస్పత్రుల్లో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వారిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద పేద ప్రజల ప్రాణాలను రక్షిస్తుంది. ధర్మపురి నియోజకవర్గంలో ఎంతో మంది పేద ,మధ్య తరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంగా మారిందని మంత్రి కొప్పుల అన్నారు.
- Advertisement -