ఏపీ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించాల్సిందే!

5
- Advertisement -

నేను, సీతక్క కలిసి ఎరవెల్లి వెళ్లాం…తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి మేడారం జాతరకు ఆహ్వానించాం అన్నారు మంత్రి కొండా సురేఖ.మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన సురేఖ..కేసీఆర్ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు…ఆయన ప్రభుత్వ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు.జాతరకు తప్పకుండా వస్తామని చెప్పారు. అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు..కేసీఆర్ తో భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదు. కుటుంబంలో విబేధాలు సర్వసాధారణం అన్నారు.

మేడారం పనులన్నీ మంత్రులు సీతక్క- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు చూస్తున్నారు…నేను నా శాఖల పనులకే పరిమితం అవుతున్నా,గతంలో అడ్మినిస్ట్రేషన్ ఇష్టానుసారంగా ..దేవాలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ఈసారి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించబోతున్నారు.ధూపదీప నైవేద్యాల అంశంపై సోషల్ ఆడిట్ జరుగుతుంది.త్వరలోనే చాలా మంది పై వేటు పడే అవకాశం ఉంది.నా పరిధిలోని శాఖల్లో ఉద్యోగుల కొరత. దేవాదాయ, ఫారెస్ట్ శాఖలను సిబ్బంది కొరత వెంటాడుతోంది.రాష్ట్రంలో మొత్తం 4300 ల దేవాలయాలు ఉన్నాయి.టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అన్నారు.

భద్రాచలం టు బాసర వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సంకల్పం.మొత్తం 3 సర్క్యూట్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలన్నది వ్యూహం.బాసర, భద్రాచలం, వేములవాడ ఫైళ్లు సీఎం రేవంత్ రెడ్డికి చేరాయి.వైటీడీ బోర్డు ఫైల్ సైతం సీఎం దగ్గరే ఉంది. బోర్డుపై త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకుంటారు.తెలంగాణలో టెంపుల్ టూరిజం ఆదాయం గణనీయంగా పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో టెంపుల్స్ ద్వారా వచ్చిన ఆదాయం ₹2 వందల 86 కోట్లు.2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో అది ₹331 కోట్లకు చేరింది.2025-26 లో టెంపుల్ టూరిజం ద్వారా ఖజానాకు దాదాపు ₹500 కోట్ల రెవెన్యూ సమకూరే అవకాశం ఉంది అన్నారు.

వేములవాడలో ₹6 వందల 90 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.టెంపుల్ టూరిజంలో భాగంగా బాసర, భద్రాచలం, ధర్మపురి, కురుమూర్తి ఆలయం మాస్టర్ ప్లాన్లు రెడీ అయ్యాయి.₹18.90 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులతో దేవాలయాల మాస్టర్ ప్లాన్ల రూపకల్పన.మాస్టర్ ప్లాన్లో చెరువుగట్టు, కాళేశ్వరం దేవాలయాలు.కొడంగల్ రామలింగేశ్వర స్వామి, వికారాబాద్ జిల్లా అనంతగిరి, అలంపూర్ జోగులాంబ దేవాలయాల మాస్టర్ ప్లాన్లు సిద్ధం చేయాల్సి ఉంది.ఆలయాల అభివృద్ధి విషయంలో ఫారెస్ట్, ఎండోమెంట్ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి.ధర్మపురిలో అభివృద్ధి పనులకు ₹34 కోట్ల నిధులు. ఇందుకోసం భూసేకరణ ఇప్పటికే పూర్తైంది.ఇప్పటికే ₹27 కోట్లు మంజూరు. వాటిలో ₹20 కోట్లు అభివృద్ధి పనులకు, ₹7 కోట్లు భూసేకరణ కోసం వినియోగిస్తున్నాం.₹110 కోట్లతో కురుమూర్తి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఘాట్ రోడ్డు, ఇతర అభివృద్ధి పనులు నడుస్తున్నాయి.వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉంది.కొండగట్టులో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించ తలపెట్టిన చౌల్ట్రీల కోసం ఏర్పాటు చేసే శిలా ఫలకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోటోకాల్ ను విధిగా పాటించాలి.టీటీడీకి సంబంధం లేని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేరును కూడా శిలా ఫలకం మీద పెడతాం అంటున్నారు.రెండు శిలా ఫలకాలు ఏర్పాటు చేయాలి. ఒకదానిపై తెలంగాణా వివరాలు, మరోదానిపై వాళ్ల వివరాలు పెడితే మాకు అభ్యంతరం లేదు.వాటిలో తెలంగాణా ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రుల పేర్లు ఉండాలి అన్నారు.

Also Read:మద్యం సీసాలపై కూటమి తప్పుడు ప్రచారం!

- Advertisement -