నల్గొండ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య మాటలయుద్ధం తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
ఇక ప్రస్తుతం గుత్తా కుమారుడు అమిత్ రెడ్డి…కాంగ్రెస్‌లో చేరి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. అయితే జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన గుత్తా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం మంత్రి కోమటిరెడ్డితో విభేదాలు మొదలయ్యాయనే చర్చ జిల్లాలో జరుగుతోంది. నల్గొండ వెళ్లిన ప్రతిసారి తన అనుచరులను చేరదీసుకొని.. వారికే ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు గుత్తా.
దీంతో కోమటిరెడ్డి వర్గం భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ పనులు కావడం లేదంటూ కోమటిరెడ్డి ముందే అసహనం వ్యక్తం చేశారు. గుత్తా తన వర్గానికే పెద్దపీట వేస్తున్నారని చెప్పడంతో స్వయంగా రంగంలోకి దిగారు మంత్రి. జిల్లా ఎస్పీని రంగంలోకి దించి గుత్తా వర్గానికి చెక్ పెట్టేలా ఆదేశాలు ఇచ్చారట.
వాస్తవానికి మండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా… జిల్లాకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఎస్కార్ట్‌గా స్థానిక ఎస్ఐ, సీఐ వెళ్లడం కామన్.అయితే ఎస్పీ ఆదేశాలతో పోలీస్ ఎస్కార్ట్ ఆగిపోయింది. తాజాగా గుత్తా జిల్లాకు వస్తే ఆయన వాహనాలకు డీజిల్ కొట్టించడం కూడా ఆపేశారట. దీంతో జిల్లా రాజకీయాల్లో అంతా సజావుగా ఉందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలకు తాజా పరిణామాలు కంటిమీద నిద్రలేకుండా చేస్తున్నాయని టాక్ నడుస్తోంది.
Also Read:షర్మిల..పోస్టు కార్డుల ఉద్యమం