బత్తాయి,నిమ్మ ఎగుమతులకు ఇకపై ఎటువంటి ఇబ్బంది ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.జాతీయంగా సరుకులు,పంటదిగుబడులు రవాణా చేసే వాహనాల మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేసిన క్రమంలో బత్తాయి,నిమ్మ రైతులు నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చని ఆయన చెప్పారు. శనివారం మధ్యాహ్నం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బత్తాయి,నిమ్మ పంటలతో పాటు జిల్లాలో అధిక దిగుబడి ఉన్న పుచ్చకాయ పంట పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యానవన మరియు పట్టుపరిశ్రమల అధికారిణి సంగీత లక్ష్మీ జిల్లాలో బత్తాయి,నిమ్మ తో పాటు పుచ్చకాయ పంట దిగుబడిని వివరించారు. చేతికి వచ్చిన పంట రవాణా సౌకర్యం లేక పోవడంతో రైతాంగం గాబరా పడుతున్నారని ఆమె మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అందుకు మంత్రి జగదీష్ రెడ్డి పై విదంగా స్పందించారు. మొత్తం జిల్లాలో 46 వేల 800 ఏకరాలలో బత్తాయి తోటలు విస్తరించి ఉండగా అందులో 30 వేల ఎకరాల పై చిలుకు బత్తాయి కాపుకొచ్చిందన్నారు.మొత్తం మీద ఈ సీజన్ లో ఒక్క బత్తాయి 43 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్న అంచనా వేశామని ఆమె మంత్రి కి తెలిపారు.
అదే విదంగా 16 వేల విస్తీర్ణంలో వేసిన నిమ్మ ఇప్పటికే 8,800 ఎకరాల్లో సాగుకు వచ్చిందన్నారు.52 వేల 400 మెట్రిక్ టన్నుల నిమ్మ పంట తో పాటు 5,300 ఎకరాల విస్తీర్ణంలో వేసిన పుచ్చకాయ దాదాపు లక్షకు పై చిలుకు మెట్రిక్ టన్నుల పంట దిగుబడికి సిద్ధంగాఉందన్నారు.ఇప్పటి వరకు జిల్లాలోని బత్తాయి,నిమ్మ,పుచ్చకాయ పంటను ఇక్కడి రైతాంగం ట్రేడర్స్ ద్వారా హైదరాబాద్, ఢిల్లీ లతో పాటు గుజరాత్ కు ఎగుమతి చేసేవారని అయితే కరోనా వైరస్ తో ఏర్పడ్డ పరిస్థితులు రవాణా రంగం మీద చూపడంతో రైతుల్లో ఆందోళన మొదలైందని సంగీత లక్ష్మి మంత్రి దృష్టికి తీసుకు రాగ జాతీయంగా ఈ తరహా ఎగుమతులు చేసే వాహనాలపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేసినందున ఎటువంటి ఇబ్బంది ఉండబోదన్నారు.అయితే అదే సమయంలో ఇక్కడి పంట ను ఇక్కడి ప్రజలు వినియోగించుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు.
రోగ నిరోధక శక్తికి సి విటమిన్ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్న విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.ఆటువంటి విటమిన్లు కలిగి ఉండి సమృద్ధిగా వచ్చిన బత్తాయి,నిమ్మను ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వకుండా జిల్లా ప్రజలు వినియోగించుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఆరోగ్యం సమ కురుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పొటాషియం వంటి పోషకాలు కలిగి ఉన్న పుచ్చకాయ వేసవిలో విరివిగా వినియోగించుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. అటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే జిల్లాలోను హైదరాబాద్ తరహలొ సంచార రైతు బజార్ల యోచనతో పాటు కూరగాయల మార్కెట్ల తరహాలో ప్రజలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే బత్తాయి,నిమ్మ,పుచ్చకాయ వంటి పంటలను వికృయించేందుకు వీలుగా ఏర్పాటు చేసే ఉద్దేశ్యం ప్రభుత్వం పరిశీలనలో ఉందన్నారు.యింకా ఈ కార్యక్రమంలో జిల్లా యస్ పి ఏ వి రంగనాధ్,అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
–