రేవంత్ ఏ పార్టీ లో ఉన్నా ఆ పార్టీ ఖతమే..

43
- Advertisement -

రేవంత్ ఏ పార్టీ లో ఉన్నా ఆ పార్టీ ఖతమే అన్నారుమ మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన.. పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్ ,టీడీపీ లదే అన్నారు. .యేళ్ళ కేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అదే పని చేస్తోందని….రేవంత్ ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ ,కాంగ్రెస్ లకు చెందిన వాడు కనుకే పిండాల గురించి మాట్లాడుతున్నారు అన్నారు. .కేసీఆర్ కు పిండం తద్దినం పెట్టడం గురించి రేవంత్ మాట్లాడుతున్నాడని…..కేసీఆర్ కు ఎందుకు పిండం పెడుతావ్ ..పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నందుకా అని ప్రశ్నించారు.

ఆర్థిక వ్యవస్థ ను గాడిలో పెట్టినందుకు కేసీఆర్ కు పిండం పెడతావా అని ప్రశ్నించారు. .తన ప్రాణాలు అడ్డం పెట్టి తెలంగాణ కు ప్రాణం పోసినందుకు కేసీఆర్ కు పిండం పెట్టాలనుకుంటున్నావా…..రేవంత్ పిండం పెట్టాలనుకుంటున్నది కేసీఆర్ కు కాదు ..తెలంగాణకు అన్నారు. రేవంత్ ఇంకా తెలంగాణ ద్రోహుల చేతుల్లో ఉన్నారు…ప్రజలు ఊహించిన దాని కన్నా గొప్పగా పాలిస్తున్నందుకు కేసీఆర్ కు పిండం పెడతావా అని ప్రశ్నించారు. .రాష్ట్రం నుంచి ఆకలి ని పారదోలినందుకా కేసీఆర్ కు పిండం పెట్టేది…..పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతావా..మాకు రావా మాటలు ..మాట్లాడలేమా అన్నారు.

Also Read:గృహలక్ష్మి నిరంతర ప్రక్రియ…మార్గదర్శకాలివే

మాజీ ప్రధాని తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావు కు సరైన అంత్యక్రియలు నిర్వహించని సంస్కారం లేని పార్టీ కి రేవంత్ అధ్యక్షుడు అని ఆరోపించారు. ఎక్కడా దిక్కు లేక రేవంత్ ను పీసీసీ అధ్యక్షుడు చేసింది కాంగ్రెస్ అధిష్టానం అన్నారు. చీమలు పెట్టిన పుట్టలో పాముగా రేవంత్ చేరాడని……రేవంత్ మాట్లాడే భాషను కనీసం వాళ్ళ ఇంట్లో నైనా ఒప్పుకుంటారా అన్నారు. 50 లక్షల లంచం డబ్బుతో దొరికి టీడీపీ కి తద్దినం పెట్టినవ్ …కరెంటు తో పిచ్చి వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ కు తద్దినం పెట్టినావు అన్నారు. కేసీఆర్ గనుక రాజకీయ కక్ష ప్రదర్శిస్తే రేవంత్ వాడుతున్న భాష కు రోడ్ల మీద తిరిగేవాడా అని….రేపటి రోజుల్లో ప్రజల చేతిలో రేవంత్ కు భంగపాటు తప్పదు అన్నారు. …మాది కల్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ రైతు బంధు భాష ,మీది పిండాల భాష కాదన్నారు.

తెలంగాణ వచ్చాక మాకు ఎవరితో శత్రుత్వం లేదని….గద్దర్ గురించి అజ్ఞాని రేవంత్ కు ఏం తెలుసు అన్నారు. గద్దర్ జీవితం ఎవరికి వ్యతిరేకంగా మొదలైంది తెలుసా…..గద్దర్ చరిత్ర తీద్దామా…..గద్ధర్ కు ఫలానా వారే నివాళుర్పించాలని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. గద్దర్ మాతో కలిసి పని చేశారు…..గద్దర్ ను అడ్డుపెట్టుకుని శవ రాజకీయం చేస్తోంది వాళ్ళే మేము కాదు అన్నారు. గద్దర్ గురించి మాట్లాడే అర్హత మాకే ఉందని……గద్దర్ ఆశయాలను చాలా నెరవేర్చాం ..పూర్తిగా సాకారం చేస్తాం అన్నారు. గద్దర్ గురించి రేవంత్ మాట్లాడితే ఆయన ఆత్మ క్షోభిస్తుంది…..రేవంత్ ఏ పార్టీ లో ఉన్నా ఆ పార్టీ ఖతమేనని…రేవంత్ అహంకారం అతి తెలివి తో కాంగ్రెస్ ను ఖతం చేస్తారు అన్నారు.

Also Read:వామ్మో..గుడ్డు పెంకులతో ఎన్ని లభాలో..!

- Advertisement -