స్వీయ నియంత్రణనే శ్రీరామరక్ష: మంత్రి జగదీష్ రెడ్డి

218
jagadish
- Advertisement -

ఆప్తులతోటే కరోనా వ్యాప్తి చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.అయిన వారే కదా అని అల్లుకుపోతే అంతిమంగా నష్టపోయేది మనమే నన్నారు.ప్రాణాంతకంగా మారిన కరోనా వైరస్ ఆప్తులతో,స్నేహితులతో, బంధు మిత్రులతో విస్తరిస్తోందన్నారు.అటువంటి ప్రమాదకర వైరస్ లక్షణాలు సోకినప్పుడుదాచి పెట్టాలని చూస్తే మొదటికే మోసం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

సూర్యాపేట మున్సిపాలిటీ పాలకవర్గంతో సహా వర్తక, వ్యాపార,వాణిజ్య,వృత్తి కార్మిక సంఘాల ప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.కరోనా కట్టడికి షరతులతో కూడిన లాక్ డౌన్ పెట్టాల్సిందేనని….వ్యవసాయ రంగంపై ప్రభావం పడకుండా చూడాలన్నారు.విందులు,వినోదాలతోటే కరోనా వైరస్ అధికంగా వ్యాప్తిస్తోందని ఆయన హెచ్చరించారు.కాగితాల తో పాటు నోట్లు చేతులు మారినప్పుడు వైరస్ సోకె అవకాశాలు లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారన్నారు.

చైనా లో మొదలు పెట్టి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి బయోత్పాతం సృష్టిస్తున్న కరోనా వైరస్ కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సత్ఫాలితాలు సాదించిందన్నారు.చేయకూడని తప్పుతో సంభవించే రోగం కాదని తెలిసో తెలియకో వైరస్ సోకితే కొందరు అమాయకంగా దాచిపెట్టాలని చూస్తున్నారన్నారు.దాచి పెట్టడం వల్ల సన్నిహితులకు సోకి వ్యాధి వందలాది మందికి సోకె ప్రమాదం ఉందన్నారు.

రాష్ట్ర ఐటి మరియు పురపాలకశాఖామంత్రి కే టి రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న అంబులెన్స్ లతో గ్రామీణ ప్రాంతాలలో టెస్ట్ లు నిర్వహిస్తామన్నారు.ఇదే విషయమై వర్తక,వ్యాపార వాణిజ్య వృత్తి కార్మిక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూకరోనా కట్టడికి షరతులతో కూడిన లాక్ డౌన్ అమలు పరచాల్సిందే నన్నారు.వ్యవసాయ ,వైద్యరంగంపై ప్రభావం చూపకుండా లాక్ డౌన్ అమలు పరచాల్సిందేనన్నారు.

యింకా ఈ టెలి కాన్ఫరెన్స్ లో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్ సీనియర్ టి ఆర్ యస్ నేతలు వైవి వ్యాపార సంఘాల ప్రతినిధులు ఐ యం ఏ నుండి డాక్టర్ విద్యాసాగర్, కిరాణం మర్చంట్ అసోసియేషన్ కు చెందిన లక్ష్మీ నారాయణ, హోటల్ అసోసియేషన్ కు చెందిన దిలీప్ రెడ్డి ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ కు చెందిన ఉప్పల ఆనంద్,మోరిశెట్టి యోగితో పాటు ఆయా సంఘాల ప్రతినిధులతో పాటు కమిషనర్ రామంజుల్ రెడ్డి మున్సిపాలిటి పాలకవర్గ సభ్యులు పాల్గొని లాక్ డౌన్ పై తమ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

- Advertisement -