- Advertisement -
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ను దేశానికి ఆదర్శంగా తీర్చి దిద్దామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్‌లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును మంత్రి కేటీఆర్‌తో కలిసి ప్రారంభించారు జగదీష్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన చేనేత రంగానికి కేటీఆర్ ఊపిరి పోశారని…తన ప్రతిభతో తెలంగాణ రాష్ట్రాన్ని పరిశ్రమలకు, ఐటీకి కేరాఫ్ అడ్రస్‌గా అభివృద్ధి చేశారని చెప్పారు.
రైతులకు, ప్రజలకు ,పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ను సరఫరా చేస్తూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోనే భగీరథ పనులను సీఎం కేసీఆర్ ప్రారంభించారని చెప్పారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు.
- Advertisement -