సూర్యాపేటలో బతుకమ్మ చీరల పంపిణీ

438
jagadish reddy
- Advertisement -

సూర్యపేట గాంధీ నగర్‌లో మంత్రి జగదీష్ రెడ్డి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్‌,ఇందిరమ్మ కాలనీ,రాజీవ్ నగర్,బాలాజీ నగర్ మహిళలు పాల్గొని కానుకలు తీసుకుని మురిసిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి…అన్ని మతాలు, కులాలు, వర్గాలను తెలంగాణ ప్రభుత్వం ఆదరిస్తుందని చెప్పారు.

ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి సంబురంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ. అలాంటి పండుగకు ఉచితంగా చీరెలను కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నలాగా ఆలోచించారని చెప్పారు. ఎన్నికల కోడ్ వల్ల దసరా కు సాధ్యం కాని చీరెలను కార్తీక మాసం సందర్భంగా పంపిణీ చేస్తున్నాం అని చెప్పారు .

సూర్యాపేటలో 2014 కు ముందు 2014 తరువాత జరిగిన అభివృద్ధి పై ప్రజలకే స్పష్టమైన అవగాహన ఉందన్నారు. టీఆర్ఎస్‌ పార్టీ మహిళ లకు అండగా ఉంటుందని…కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, అమ్మవడి పధకాలను ఎన్నికల హామీ లో చెప్పకున్నా ..మహిళా సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన కేసీఆర్ మహిళ పట్ల ఉన్న తనకు ఉన్న గౌరవాన్ని, చాటుకున్నారని చెప్పారు.

2014 కంటే ముందు ఉన్న నాయకులు సూర్యాపేట ప్రజల కు ఇచ్చిన హామీలు.. హామీలు గానే ఉండేవి కానీ ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గం లో ప్రవహించేది కాళేశ్వరం నీళ్లే అన్నారు. కొంత మంది నాయకులు అసత్య ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు…టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పధకాలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా లేవు అన్నారు. సూర్యాపేట లో జరుగుతున్న అభివృద్ధి ఆరంభం మాత్రమే…ఏ సందర్భం వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీ కి అండగా నిలబడాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీడీ బిక్షం, మాజీ మార్కెట్ చైర్మన్ వైవీ, మాజీ ఎంపీపీ వట్టే జానయ్య యాదవ్, మాజీ సర్పంచ్ రేణుక, పెద్ది రెడ్డి రాజా , ఆర్డీవో మోహన్ రావు, మున్సిపల్ కమిషనర్ రామాంజి రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -