భువనగిరి యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రతి అంశంపై నిశితంగా అధికారులతో సమీక్షించారు మంత్రి. అలాగే హరితహారం, పచ్చధనం-పరిశుభ్రతపై వేరువేరుగా అధికారులతో సమీక్షించారు.ఈ సమావేశంలో మంత్రి తోపాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,శాసన మండలి సభ్యులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ,జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్.. పట్టణ ప్రగతి-పల్లె ప్రగతిల పురోగతిపై అధికారులు క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. గ్రామ పంచాయతీలకు తడిచెత్త-పొడి చెత్తలతో ఆదాయం చేకూరుతుంది. తడిచెత్త-పొడి చెత్తలతో సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవాలని.. తద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం లభిస్తుంది అని మంత్రి అన్నారు. తడిచెత్త పొడి చెత్తను సేకరించేందుకు ప్రభుత్వం అందించిన ట్రాక్టర్ లను వినియోగించాలి.
హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి అని మంత్రి సూచించారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు ఉండాలని..మొక్కల నాటడంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం ఉంది అన్నారు. నాటిన మొక్కల పెంపకానికి సమృద్ధిగా నిరందించాలి. నీటి సరఫరాకు ప్రభుత్వం అందించిన ట్రాక్టర్లు,ట్యాన్క్ర్లు వినియోగించుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.