కరోనా పరిణామాలపై జగదీష్ రెడ్డి మంత్రి సమీక్ష..

181
minister jagadeesh
- Advertisement -

లాక్ డౌన్ పూర్తిగా అమలులో ఉన్న సూర్యపేట జిల్లా కేంద్రంలో అటు మెడిసిన్స్ తో పాటు ఇటు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.తాజా పరిణామాలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆదివారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పలు అంశాలపై సుదీర్ఘంగా నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్ లతో పాటు అదనపు కలెక్టర్ సంజీవ్ రెడ్డి పి డి డి ఆర్ డి ఏ. కిరణ్ కుమార్ ప్రత్యేక అధికారి వేణుగోపాల్ రెడ్డి, స్థానిక మున్సిపల్ కమిషనర్ రామంజూల్ రెడ్డి తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు.

గడిచిన నాలుగు రోజులుగా జరుగుతున్న పురోగతితో పాటు లాక్ డౌన్ అమలులో బాగంగా కంటైన్మెంట్ జోన్ లుగా గుర్తించిన ప్రాంతాలను అధికారులు మ్యాప్ లతో సహా మంత్రి జగదీష్ రెడ్డికి వివరించారు. ఎక్కడికక్కడ పటిష్టవంతమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. అన్నింటినీ సమీక్షించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. లాక్ డౌన్ అమలుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం అభినందనీయమే అయినప్పటికీ నిత్యావసర సరుకుల సరఫరాపై దృష్టి సారించాలని సూచించారు.అందుకు అనువైన పద్ధతుల్లో పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు.

కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న సూర్యపేట పట్టణంలో ఉదయం 6 గంటల నుండి పాలు, కూరగాయలు వార్డుల వారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.అదే విధంగా రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా సూర్యపేటలో ప్రారంభించిన ఆన్ లైన్ యాప్ కు డిమాండ్ పెరుగుతున్నందున మటన్, చికెన్ లను కూడా ఇక పై ఆన్ లైన్ ద్వారానే అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలన్నారు. అయితే ఆన్ లైన్ లో మెడిసిన్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉన్నందున పట్టణంలోనీ ప్రయివేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మాసిస్టులను వినియోగించుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.

అదే సమయంలో సూర్యపేట లో హోల్ సేల్ షాప్ ల మూసివేతతో సూర్యపేట పరిసర ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ పట్టణ శివార్లలో ఉన్న యస్ వి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హోల్ సేల్ షాప్ ల ఏర్పాట్లపై ద్రుష్టి సారించాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తద్వారా గ్రామీణ ప్రాంతాలలో కీ సరుకుల సరఫరా లో ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుంటా ఉంటాయన్నారు. అయితే సూర్యపేట పట్టణంలో ప్రజలు ఎవరూ యిండ్లను వీడి బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

కాగా హోల్ సేల్ షాపులలో ప్యాకింగ్ సెక్షన్ లలో పనిచేసే సిబ్బంది కూడా కంటోన్మెంట్ జోన్ లో ఉన్నందున గ్రామీణ ప్రాంతాలలోనీ మహిళా సంఘాలను సంప్రదించి ఔత్సాహికులు ఎవరైనా ఉంటే వారిని వినియోగించే లా చూడాలని ఆయన చెప్పారు. కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలులో ఉండడం తో పాటు పరిస్థితిల ప్రభావంతో కంటైన్మెంట్ జోన్ లుగా ప్రకటించి ఉన్నందున ప్రజలెవ్వరు పాలు మొదలు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ అదే విదంగా మటన్, చికెన్,రంజాన్ మాసం కావడంతో దీక్ష విడిచే సమయానికి ముస్లిం సోదరులకు పండ్లు అందుబాటులో ఉంచేలా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చర్చించి నిర్ణయించినట్లు సమీక్షా అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -