కులరహిత సమాజం కోసం భారత మాజీ ఉప ప్రధాని , కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ ఎంతో పాటుపడ్డారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు.బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా మంత్రి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. వేలాది మంది దళిత సోదర సోదరీమణులతో కలిసి క్యాంపు కార్యాలయం నుండి కొత్త బస్టాండ్ వద్ద గల బాబు జగ్జీవన్ రామ్ కాంస్య విగ్రహం వరకు రెండు కిలోమీటర్ల పాదయాత్ర ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి డప్పు వాయించిన మంత్రి ఆయన చేసిన సేవలను కోనియాడారు.. ఆర్దికంగా దళితులను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు పార్లమెంట్‌లో ఎంతో కృషి చేశారని మంత్రి గుర్తుచేశారు.దేశంలో కుల ,వర్ణ వివక్షలు కొనసాగుతున్న తరుణంలో అణచివేతలను తట్టుకుని పూలే ఆశయ సాధనకు నడుం బిగించి ఉప ప్రధాని వరకు ఎదిగిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్ గారని కొనియాడారు.
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. పూలే,జగ్జీవన్ ఆశయ సాధన కోసం పాటుపడుతున్న గొప్పతనం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుంతుందన్నారు.ఇప్పటి వరకు ప్రభుత్వాలు దళిత సమాజం కోసం ఎన్ని పధకాలు తీసుకువచ్చినా వారి ఆర్థిక ఉన్నతికి అవి చాలవని గుర్తించి దళిత బంధు తీసుకువచ్చిన గొప్పతనం కేసీఆర్ ది అన్నారు..దళితులకు కాంట్రాక్టు లలో సైతం రిజర్వేషన్లు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే చిరస్మరణీయంగా నిలిచి పోతారన్నారు.