తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది

426
jagadeeshreddy

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానకే ఆదర్శంగా నిలిచిందన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని నెరేడుచర్ల మున్సిపాలిటీలో నిర్వహించిన భారీ రోడ్‌షో లో పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో కూడా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ది పథకాలే టీఆర్ఎస్ అభ్యర్దులను గెలిపిస్తాయని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు. 2014లో తెలంగాణ ప్రజలు అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేస్తే కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత రాష్ట్రం ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే మరో వెయ్యేళ్లు అయిన కాళేశ్వరం నీళ్లు వచ్చేవి కావన్నారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు వచ్చాయన్నారు.