తెలుగు సినీ నటుడు వేణుమాధవ్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ వార్త విని మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు.
వెండి తెరపై నవ్వులు ఆరబోసిన తెలంగాణ బిడ్డ.. చిన్న వయసులోనే పెద్ద పెరు తెచ్చుకున్న హాస్యనటుడు వేణుమాధవ్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నో సవాళ్ళను అధిగమించి ఉన్నత స్థానానికి ఎదిగిగారు వేణుమాధవ్. సినిగగన నీలాకాశంలో హాస్యాన్ని పండించిన ఆయన సూర్యపేట జిల్లా బిడ్డడు కావడం మాకెంతో గర్వకారణం ఉంది అని మంత్రి తెలిపారు.
హాస్య ప్రపంచానికి వేణు మరణం తీరని లోటు అని ఆయన అన్నారు.కళామతల్లి ఒడిలో ఒరిగిపోయిన వేణు ఆత్మకు శాంతి చేకూరలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబ సభ్యులు దైర్యంగా ఉండాలని వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మంత్రి.
మిమిక్రీ కళాకారుడిగా కెరీర్ ప్రారంభించిన వేణు మాధవ్ ఆ తర్వాత కమెడీయన్‌గా రాణించారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన సంప్రదాయం చిత్రంతో ఆయన ఆరంగేట్రం చేశారు. తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్ర వేశారు వేణుమాధవ్. టాలీవుడ్‌లో 600లకు పైగా చిత్రాల్లో ఆయన నటించారు.