బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే:మంత్రి జగదీష్ రెడ్డి

476
minister jagadeeshreddy
- Advertisement -

సూర్యాపేట : బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పూలే చేసిన కృషి మరవలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కొనియాడారు. జ్యోతిబా ఫూలే 129 వ వర్దoతి కార్యక్రమం సందర్భంగా సూర్యాపేట లో పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించిన మంత్రి మహాత్మ జ్యోతి బా పూలే చేసిన సేవలను కొనియాడారు.

ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం కృషిచేస్తోందని తెలంగాణ రాష్ట్రంలో ఫూలే ఆశయాలను కొనసాగిస్తామన్నారు. విద్యావ్యాప్తికి పూలే చేసిన కృషిని ఎనలేనిదని ఈ సందర్భంగా మంత్రి కొనియాడారు.ప్రతీ ఒక్కరు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టి.ఆర్.ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిమ్మల శ్రీనివాస్ గౌడ్,జడ్పిటిసి జీడీ బిక్షం, గుండూరి కృపాకర్, టి ఆర్ ఎస్ నేతలు , ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు,విద్యార్థులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

minister jagadeeshreddy speech at Jyotiba Phule death anniversary …. minister jagadeeshreddy speech at Jyotiba Phule death anniversary

- Advertisement -