బాబాసాహెబ్ అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం…

265
minister jagadeesh
- Advertisement -

బాబాసాహెబ్ అంబెడ్కర్ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 129 వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఉన్న మంత్రి జగదీష్ రెడ్డి నివాస గృహంలో అంబెడ్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు.
బాబాసాహెబ్ అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగంలో అంబెడ్కర్ మహాశయుడు పొందు పరచిన ఆర్టికల్ 3 ఏ ద్వారానే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు.అటువంటి మహానియుడి సంకల్పం తో ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఆయన ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేపట్టారని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని దారపోసిన అంబేద్కర్ స్ఫూర్తి భారతదేశానికి ఎప్పటికీ ఉంటుందన్నారు.అదే సమయంలో యావత్ ప్రపంచానికి సంభవించిన కరోనా విపత్తు నుండి రాష్ట్రాన్ని బయట పడేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.యావత్ ప్రజానీకం లాక్ డౌన్ కు మద్దతు పలికి యిండ్లలోనే ఉండాలని అటువంటప్పుడే కరోనా వైరస్ లింక్ వ్యాప్తి చెందకుండా నిరోదించగలుగుతామని మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు.

- Advertisement -