ప్రతి మండలంలో ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు కృషిచేస్తామని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. సోన్ మండంలోని పాక్ పట్ల గ్రామంలో ఏర్పాటుచేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఇంద్రకరణ్… గ్రామాలు అభివృద్ధి పథంలో కొనసాగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగాపెట్టి సేవలందించిన వైద్య సిబ్బందిని, ఆశా కార్యకర్తలను మంత్రి సన్మానించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ కింద 15 ఎకరాల్లో రూ. 40 లక్షల వ్యయంతో ఈ బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వల్లడించారు.