ప్రజలందరిలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని 15 రోజుల పాటు ద్విసప్తాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. నిర్మల్‌లో ఫ్రీడం రన్‌ను ప్రారంభించిన ఆయన..జాతీయ పతాక కీర్తిని నలుదిక్కులా చాటాలన్నారు.
స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా పాఠశాల విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, యువతీ యువకులను స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగస్వాములను చేశామన్నారు.
గాంధీజీ శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని చెప్పారు హోంమంత్రి మహమూద్ అలీ. 5 కే రన్‌లో విద్యార్థులు పాల్గొనడం అభినందనీయం అన్నారు. బంగారు తెలంగాణ సాధించే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా దేశానికే స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.