ప్రజలు ధైర్యంగా ఉండాలి- మంత్రి ఐకే రెడ్డి

74
- Advertisement -

నిర్మల్ జిల్లా మామడ మండలంలో శనివారం రాత్రి పెద్ద ఎత్తున్న గాలి తుఫాను, కొద్ది పాటి వర్షం కురియగా.. దెబ్బతిన్న ప్రాంతాలను ఈ రోజు సాయంత్రం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. గ్రామంలో పర్యటించి స్థానికులతో మాట్లాడి నష్టం అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొన్న కురిసిన చిన్నపాటి వర్షంతో పాటు తీవ్ర గాలులకు మామడలో తొమ్మిది ఇండ్ల పైకప్పు రేకులు కొట్టుకు పోవడం జరిగిందని దీనితో ఎటువంటి ప్రాణ నష్టం జరగకున్న ఇండ్లల్లో ఉన్నవాళ్లు నిరాశ్రయులయ్యారని అన్నారు. మండలంలో ఆరేపెళ్లి, న్యూ సాంగ్వి, చందరం, గ్రామం మొత్తంలో పదమూడు పద్నాలుగు ఇండ్ల వరకు దెబ్బతిన్నాయని దీని వల్ల నిరాశ్రయులు అయిన వారిని వివిధ గ్రామాల్లో ఉన్న ఇతరుల ఇండ్లల్లో బస చేసేందుకు గ్రామాల వారు ఏర్పాటు చేసారని తెలిపారు.

అంతే కాకుండా ఈ వర్షాల గాలులకు ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి ప్రభుత్వం నుండి ఒక లక్షా ఐదు వేల రూపాయలు,పాక్షికంగా దెబ్బతిన్నవారికి తొంబై ఐదు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉందని దీనిని తహసీల్దార్ పూర్తి పరిశీలన చెయ్యడమే కాకుండా జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ పరిశీలించడం జరిగిందని అన్నారు. ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి అని వర్షాలకు నదులు చెరువులు పొంగుతాయని అలాంటప్పుడు ప్రజలు ధైర్యంగా ఉండాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న కుటుంబాలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వర్షపు గాలులకు మండలంలో దెబ్బతిన్న కరెంటు స్తంభాల మరమ్మతులు చేయిస్తాం అని నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం నుండి సహాయం త్వరగా అందేలా చూస్తామని మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ,అదనపు కలెక్టర్ రాంబాబు, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, అధికారులు, మండల ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

- Advertisement -