ఇపిటిఆర్ఐ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంత్రి అల్లోల..

15
Minister Allola

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇపిటిఆర్ఐ రూపొందించిన క్యాలెండర్- 2021ను ఈ రోజు అరణ్య భవన్‌లో ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఇపిటిఆర్ఐ) “గ్రీన్ స్పేస్ యోగ ఫర్ వెల్నెస్” అనే ఇతివృత్తంతో పాటు ప్రతి నెల జరుపుకునే ముఖ్యమైన పర్యావరణ దినోత్సవాల ఆవశ్యకతను ఈ క్యాలెండర్‌లో పొందుపరిచినట్లు ఇపిటిఆర్ఐ డైరెక్టర్ జనరల్ ఆధార్ సిన్హా మంత్రికి వివరించారు.