క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం- మంత్రి ఐకే రెడ్డి

64

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో జరిగే సాఫ్ట్ బాల్ జాతీయ స్థాయి పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు 8 రోజులుగా జరిగాయి. ఈ మేరకు ఎన్టీఆర్ స్టేడియంలో ముగింపు క్రీడలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సాఫ్ట్ బాల్ క్రీడలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు చేర్చినట్లు తెలిపారు. క్రీడల్లో గెలిచిన క్రీడాకారిణిలకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు క్రీడా అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించిన మేరకు రాష్ట్ర అసోసియేషన్ తరపున ప్రతిపాదనలు పంపిస్తే అవసరమైన శిక్షణ, నిధుల విషయంలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని భరోసా ఇచ్చారు.