పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు..

91
minister ik reddy
- Advertisement -

నిర్మల్‌ జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్‌ను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మల్ కు బీసీ స్టడీ సర్కిల్‌ను మంజూరు చేసి.. పేద విద్యార్థులు బాగా చదువుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని మంత్రి అన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగాల పోటీపరీక్షలు రాసే విద్యార్థులు హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చెదని తెలిపారు. పేద విద్యార్థులు బీసీ స్టడీ సర్కిల్‌లో బాగా చదువుకొని ఉద్యోగాలు సాధించాలని సూచించారు. ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్ మంజూరు చేస్తుందన్నారు.

కాగా మంగళవారం మంత్రి క్యాంపు కార్య ఆయనను కలిసిన జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్ గౌడ్,డాక్టర్ కృష్ణంరాజు, అడిగెల రాజేశ్వర్, సృజిత్, పలువురు విద్యార్థులు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, FSCS చైర్మన్ ధర్మజి రాజేందర్, తెరాస పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,తెరాస నాయకులు పి.రాం చందర్,దేవేందర్ రెడ్డి, ముడుసు సత్యనారాయణ, దాయత్ సోమేశ్,రామ లింగం తదితరులు ఉన్నారు.

- Advertisement -