రేవంత్ రెడ్డి నోరు అదుపులో ఉంచుకో- మంత్రి అల్లోల

213
- Advertisement -

రేవంత్ రెడ్డి భాష సరిగా లేదు.. మాకు అలాంటి భాష రాదు. నా మీద వ్యక్తిగతంగా మాట్లాడితే నాలుక తెగ్గొస్తా అని మండిపడ్డారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు, వాడిన పదజాలంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్సీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతకు ముందు హెచ్చరించినా రేవంత్ స్వభావాన్ని మార్చుకోలేదు. సీఎం కేసీఆర్ అందరికీ దగ్గరవుతున్నారనే రేవంత్‌కు ఈర్ష్యగా వుంది. రేవంత్ నోరు అదుపులో ఉంచుకో..ఓటుకు నోటు దొంగవని అందరికీ తెలుసు..నీకు పీసీసీ పదవి ఎలా వచ్చిందో కూడా తెలుసు అని మంత్రి దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి బాష మార్చుకోకపోతే ప్రజలతో చీ అనిపించుకుంటావు అని హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే 20ఏళ్ళు టీఆర్‌ఎస్ ఏ అధికారంలోనే ఉంటుంది. ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరైన విధానం కాదని మంత్రి పేర్కొన్నారు. కాగా పోడు భూములపై సీఎం కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. పోడు భూముల రికార్డులు నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు సీఎం ఇచ్చారు.
పోడు భూముల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవ్వరికీ లేదన్నారు.

- Advertisement -