పేదింటి ఆడపడుచు వివాహానికి అండగా మంత్రి కొప్పుల..

257
Koppula
- Advertisement -

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపల్లి గ్రామానికి చెందిన అల్పట్ల పూజిత నిరుపేద కుటుంబానికి చెందిన అమ్మాయి. అమె తండ్రి చిన్న తనంలో మరణించాడు. అయితే పూజిత వివాహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆర్ధిక సాయం చేసి అండగా నిలిచారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో పేదింటి ఆడపడుచు వివాహనికి LM కొప్పుల ఛారిటీ ట్రస్టు ద్వారా ఒక్కొకరికి పట్టు చీరలతో పాటుగా 10,000/- రూపాయలు అందిస్తున్నారు. ఈ రోజు మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, LM కొప్పుల ఛారిటెబుల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ కొప్పుల స్నేహలత పూజితకు ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు పుజితకు బొట్టు పెట్టి చీరను అందించారు. మంత్రి కొప్పుల LM కొప్పుల ఛారిటెబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి నిరుపేదలకు సాయం చేస్తున్నరు.

- Advertisement -