పంటల సాగుపై రైతుల్లో చైతన్యం తేవాలి: హరీష్ రావు

202
harish
- Advertisement -

రైతులకు లాభం చేకూర్చే పంటల సాగుపై వారిని చైతన్యం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటలోని శ్రేష్ట ఫంక్షన్‌ హాల్‌లో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు విత్తనాల్ని కొనుక్కు రావడమే కాదు,తయారు చేసే పని కూడా నంగునూరు మండల రైతులు చేయాలన్నారు.
రైతులు , ప్రజా ప్రయోజనార్థం వారి ఆదాయాభివృద్ధి పెరిగేలా.. సేవ చేసినప్పుడే నిజమైన ప్రజాసేవ చేసిన వారవుతారని ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు అంజవ్వ కుటుంబానికి రూ. 5 లక్షలు, పశువులు మృతి చెందిన ఇద్దరికి, కాల్వల భూ సేకరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మొత్తం 216 మందికి గాను రూ.77 లక్షల 30 వేల 432 రూపాయలు విలువ చేసే చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

- Advertisement -