కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు మంత్రి హరీశ్ రావు. ఏపీకి బదలాయించిన సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీం (సీఎస్‌ఎస్) రూ.495 కోట్లు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. 2014-15లో సీఎస్‌ఎస్ కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నగదును పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాలో జమచేశారని, వాటిని తిరిగి తెలంగాణకు ఇప్పించాలని లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సంవత్సరంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారన్నారు.
ఈ విషయాన్ని తాము ఇప్పటికే కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఎనిమిదేండ్లు గడుస్తున్నా రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేఖలో విన్నవించారు.
ఇవి కూడా చదవండి..