మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు. మెదక్ జిల్లాలోని ఏడుపాయలలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా వన దుర్గ భవానీ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వనదుర్గా అమ్మవారిని దర్శించుకున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా హన్మకొండ వేయిస్తంభాల గుడిలో కొలువైన రుద్రేశ్వర స్వామి వారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం స్వామి వారి పట్టు వస్త్రాలతో సన్మానించి వేద ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మహాశివరాత్రి శివపార్వతుల పెండ్లి రోజని, లింగోద్భవం జరిగిన రోజని చెప్పారు. ఈ రోజు ఆ మణికంఠుని దర్శనం అత్యంత పవిత్రమైనదిగా శివ భక్తులు భావిస్తారని అన్నారు.