రాఖీ విషెస్ తెలిపిన హరీశ్..

108
harish
- Advertisement -

అన్నా చెల్లెళ్ళ – అక్క తమ్ముళ్ళ అనుబంధానికి రాఖీ పండుగ ఒక ప్రతీక అమ్మానాన్నలతో సమానంగా ప్రేమను పంచిన సోదరులకు అన్నింటా విజయం కలగాలని ఆకాంక్షిస్తూ కట్టే రాఖీలో ప్రేమానుబంధాల ముడి ఉంది. కులం, మతం అనే భేదాలు లేకుండా భారతదేశమంతా ఒక వసుదైక కుటుంబం అని చాటే ఒక అర్ధం ఈ రాఖి పండుగలో ఇమిడి ఉంది.

దేశవ్యాప్తంగా రాఖి సంబరాలు అంబరాన్నంటగా వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఇంట్లో రాఖీ పండుగ సంబురాలు ఘనంగా జరిగాయి. కుటుంబ సభ్యులతో పాటు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకొని సందడి చేశారు. మంత్రి హరీశ్ రావుకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని…అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -