సూపర్ టేస్ట్… డైటింగ్ మస్త్..!!

27
- Advertisement -

సిద్దిపేట టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇడ్లీ బాగుంది… సూపర్ టేస్ట్ అన్నారు. హౌసింగ్ బోర్డు లో రోడ్డు ఫై ఉన్న టిఫిన్ బండి వద్ద ఆగి టిఫిన్ చేశారు. యువత తో సరదా గా ముచ్చటించారు. ప్రతి రోజు వస్తాం సార్… ఇక్కడ టేస్ట్ బాగుంటుందని తెలిపారు.

సిద్దిపేట అప్పటికి ఇప్పటికి అభివృద్ధి లో చాలా చేంజ్ అయిందన్నారు. ఒక్కసారే ఇడ్లీ టిఫిన్ బండి వద్ద హరీష్ రావు అగడం తో అశ్చర్య పోయారు టిఫిన్ ప్రియులు. టిఫిన్ బండి… కాసేపు సెల్ఫీ సందడి గా మారింది.

సాదా సీదా గా వచ్చిన హరీష్ రావు ను చూసి యువత సరదా గా ముచ్చటించారు.తర్వాత స్ధానికులతో కలిసి టిఫిన్ తింటా అంటూ… ఒక ఇడ్లి… ఒక దోశ టేస్ట్ చేశారు… బాగుంది అంటూ గిరాకీ మంచిగా అవుతుందా అని వ్యాపారిని అడిగారు.

Also Read:అఫ్గాన్ టూర్ లో కెప్టెన్ ఎవరు ?

- Advertisement -