బీజేపీపై మరోసారి ఫైరయ్యారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట జిల్లా అప్పనపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థిని సోలిపేట సుజాతతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్…-రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్నాం అని చెప్పారు.
బిజెపి పాలిత రాష్ట్రాల్లో రైతుకు రైతుబంధు ఇస్తున్నారా?..-రైతులు చనిపోతే అయిదు లక్షల బీమా ఇస్తున్నాం అని తెలిపారు. బీడీ కార్మికుల పింఛన్‌లో 1600 కేంద్రానివేనని బీజేపీ వాళ్లు చెబుతున్నారు..వాళ్లు చెప్పింది నిజమైతే నేను రాజీనామా చేస్తా లేకుంటే బిజెపి వాళ్లు ముక్కు నెలకు రాస్తారా అని ప్రశ్నించారు.
కెసిఆర్ కిట్టు పైసలు మొత్తం టిఆర్ఎస్ ప్రభుత్వంవే..మొన్న బిజెపి పార్టీ నాలబై లక్షలు దొరికినయ్ చీరలు దొరికినయ్ సిద్దిపేట పైసలు దొరకగానే కుడితిలో పడ్డ ఎలుకలా బీజేపీ నేతల పరిస్ధితి తయారైందన్నారు. -అప్పనపల్లి గ్రామంలో కాలువకు భూములు కోల్పోయిన వారికి సిద్దిపేట లాగే నష్టపరిహారం ఇప్పిస్తా ….కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చినం గోదావరి నీళ్ళతో కాళ్లు కడుగుతాం అన్నారు.