బీజేపీ, కాంగ్రెస్ వస్తే చీకటి రోజులే అన్నారు మంత్రి హరీశ్ రావు. గజ్వేల్ మహతి ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ అధికారులకు నిర్వహించిన వానాకాలం సాగుకు సన్నాహక సమావేశంలో మాట్లాడిన హరీశ్.. వచ్చే వానాకాలం ఏ పంటలు వేస్తే రైతులకు మేలు జరుగుతదో ఆలోచించాలన్నారు. గతంలో ఎండాకాలం వచ్చింది అంటే అంబలి కేంద్రాలు, రైతుల ఆత్మహత్యలు, ధర్నాలు ఆందోళనలు ఉండేవని కానీ ఐదేళ్లలో మార్పు తెచ్చామన్నారు. ఇప్పుడు ఏ మూలకు వెళ్లిన ధాన్యపు సిరులు కనిపిస్తున్నాయని…. భూమికి బరువయ్యబత పంట పండిస్తున్నామన్నారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతుల ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, కష్టాలు, కన్నీళ్లు…వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి అన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్, సాగు నీళ్లు, రైతు బంధు, రైతు బీమా ఇలా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయని…. రైతు బీమా రద్దు చేయాలని అంటున్నారు.. రద్దు చేద్దామా.!?రైతు బీమా అంటే ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని చెప్పారు.
అత్యధికంగా రైతు ఆత్మహత్యలను తగ్గించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ అని కేంద్రం చెప్పిందని… బీజేపీ బాయిల కాడా మీటర్లు, బోర్లు కడా మీటర్లు అంటున్నారు… నల్ల చట్టాలు తెచ్చి రాష్ట్రానికి రావలసిన 25 వెల కోట్లు కేంద్రం ఆపుతోందన్నారు. బీజేపీ అధికారంలో వస్తే ఉచిత కరెంట్ వస్తాదా ఆలోచించాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ లో ఇచ్చినట్లు ఉచిత కరెంట్, రైతు బంధు, బీమా కోసం డిమాండ్ చేయాలన్నారు.