సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు మంత్రి హరీశ్ రావు. మాతా, శిశు మరణాల రేటు అతి తక్కువగా ఉన్న మూడో రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. 2014 నాటికి రాష్ట్రంలో శిశు మరణాల రేటు 39 కాగా.. ప్రస్తుతానికి 21కి తగ్గిందని వెల్లడించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. పేద మహిళలకు న్యూట్రీషన్ కిట్స్ కూడా అందజేస్తున్నామని తెలిపారు. వసతులు పెంచడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరిగిందని తెలిపారు హరీశ్.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య 61 శాతం పెరిగిందని హరీశ్ రావు తెలిపారు. నార్మల్ డెలివరీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. నార్మల్ డెలివరీకి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చామని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం కూడా అభినందించిందని గుర్తు చేశారు. ఆస్పత్రుల్లో డెలివరీలను 99.9 శాతానికి పెంచామని పేర్కొన్నారు. డెలివరీ సమయంలో చనిపోయే తల్లుల సంఖ్య తెలంగాణలో 43 మాత్రమే అని అన్నారు.
ఇవి కూడా చదవండి..