- Advertisement -
మంకీ పాక్స్ పై ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం అని పిలుపునిచ్చారు మంత్రి హరీశ్ రావు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క కేసు నమోదు కాలేదని… ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రతలు తీసుకుంటుందన్నారు. నిర్ధారణ పరీక్షలకు గాంధీ ఆసుపత్రి, నోడల్ హాస్పిటల్ గా ఫీవర్ ఆసుపత్రి అందుబాటులో ఉన్నాయన్నారు.
డిఎంఇ, టీవీవీపీ ఆసుపత్రుల వైద్యులతో సమీక్ష నిర్వహించిన హరీశ్…మంకీపాక్స్ నమోదైన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు, మంకీ పాక్స్, వ్యాక్సినేషన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య వివరాలు, సలహాలు కోసం 04024651119, 9030227324 సంపాదించాలని ప్రజలకు సూచించారు.
- Advertisement -