- Advertisement -
హైదరాబాద్ కానిస్టేబుల్ బాబ్జీపై ప్రశంసల వర్షం కురిపించారు మంత్రి హరీశ్ రావు. నిత్యం రద్దీగా ఉండే అబిడ్స్ జీపీవో ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు కానిస్టేబుల్ బాబ్జీ. ఈ క్రమంలో ఓ అంబులెన్స్ జీపీవో ప్రాంతంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోగా వెంటనే రంగంలోకి దిగిన బాబ్జీ అంబులెన్స్ ముందు పరుగులు పెడుతూ రోడ్డును క్లీయర్ చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా బాబ్జీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు సైతం స్పందించారు. హ్యాట్సాఫ్ బాబ్జీ అంటూ ట్వీట్ చేసిన హరీశ్…. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌ను ఆస్పత్రికి చేర్చిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిపోతుందన్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్ గర్వంగా ఫీలయ్యే గొప్ప పని చేశావు అంటూ బాబ్జీని మంత్రి కొనియాడారు.
- Advertisement -