చెట్లు నాటడం మనందరి బాధ్యత: హరీష్ రావు

295
harishrao
- Advertisement -

చెట్లు నాటడం మనందరి బాధ్యత…ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా చెట్లు నాటాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లిలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎవెన్యూ ప్లాంటెషన్‌లో మొక్కలు నాటారు. అనంతరం డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి జిల్లా సహకారా కేంద్ర బ్యాంకును ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్….తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతు కండ్లలో ఆనంద భాష్పాలు వస్తుంటే.. కాంగ్రెస్ నాయకుల కండ్లలో కనీళ్లు వస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో ఏదో ఒకటి చేయాలని కాంగ్రెస్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు.

70 ఏండ్ల కాంగ్రెస్,టీడీపీ పాలనలో చేయని అభివృద్ధి పనులను టీఆర్ఎస్ ఆరేళ్లలో చేసిందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను హరిత తెలంగాణగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -