సమ్మె వీడి వెంటనే విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ దృష్టిలో పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఉన్నాయని, సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని భరోసా ఇచ్చారు. ఇప్పటికే రూ.1000 వేతనాన్ని అడక్కుండానే పెంచారని త్వరలోనే కార్మికులతో చర్చలు జరిపి తప్పకుండా వారికి న్యాయం జరిగేలా మంత్రి ఎర్రబెల్లి చూసుకుంటారని చెప్పారు. కాబట్టి పారిశుధ్య కార్మికులంతా సమ్మెను విరమించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
పనికిమాలిన రాజకీయాలు చేసే కొన్ని పార్టీల ఉచ్చులో పడొద్దని వెల్లడించారు. సీఎం కేసీఆర్ కార్మికులందరినీ చల్లగా చూస్తారని, ఎలాంటి సమ్మెలు, ధర్నాల వంటి కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ పల్లెలకున్న గొప్ప పేరును ఖరాబు చేయవద్దన్నారు. గత ప్రభుత్వాలలో రూ.500, రూ.1000 కూడా లేని వేతనాలను గ్రామాల్లో కార్మికులు గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో అడగకుండానే సీఎం కేసీఆర్ రూ.8,500కు పెంచారన్నారు. అలాగే అడగకుండానే ఈ మధ్యే రూ.8,500 నుంచి రూ.9,500కు పెంచిన మనసున్న మనిషి కేసీఆర్ అని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయని కాబట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
Also Read:హిడింబ ప్రీమియర్ టాక్ ఇదే