ఆర్మీని ప్రైవేట్ పరం చేసే కుట్ర: హరీశ్‌ రావు

129
Minister Harish Rao
- Advertisement -

ఆర్మీని ప్రైవేట్‌పరం చేసే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు మంత్రి హరీశ్ రావు. కేంద్రం నిర్ణయంతో దేశంలో అగ్ని రాజుకుందని చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రూ.37 కోట్ల వ్యయంతో చేపట్టిన వంద పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు.

అగ్నిపథ్‌ వద్దన్న యువకులను కాల్చి చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ దాడుల వెనక ఇక్కడ టీఆర్‌ఎస్‌ హస్తం ఉంటే మరి ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అల్లర్ల వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు.

బీజేపీ నేతలు బండి సంజయ్‌, డీకే అరుణ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజావ్యవతిరేక నిర్ణయాలతో ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు.

- Advertisement -