- Advertisement -
ముచ్చింతల్ ల్లోని శ్రీశ్రీశ్రీ త్రిదండిచిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమంలో స్వామి వారిని గౌరవప్రదంగా కలిశారు మంత్రి హరీష్ రావు. చిన్నజీయర్ స్వామీజీ వారి ఆశీస్సులు తీసుకున్నారు హరీష్. ఫిబ్రవరిలో జరగబోయే శ్రీ రామానుజ శతాబ్ది ఉత్సవ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
చిన్నజీయర్ స్వామీజీ వారితో కలిసి ఆశ్రమంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి హరీష్. యాగంలో ఉపయోగించే నెయ్యి ఉత్పత్తి కేంద్రాన్ని స్వామీ వారితో కలిసి ఈ సందర్భంగా పరిశీలించారు మంత్రి. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
- Advertisement -