పరకాలలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్ధాపన చేశారు మంత్రి హరీష్ రావు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన…పరకాలలో 100 పడకల ఆసుపత్రికి శంఖుస్థాపన చేసుకోవడం సంతోషం. ఏడాదిలో ఆసుపత్రి పూర్తి చేస్తాం అన్నారు. తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్..తెలంగాణ ఏం చేస్తుందో అదే చేయడానికి అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయన్నారు.ఎవరూ అడగకున్నా రైతుబందు ఇచ్చాము. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. రైతు భీమా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం అన్నారు.
నీటి తీరువా లేకుండా రైతన్నలకు నీళ్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ…. పైరవీలు లేకుండా రైతు బంధు ఇస్తున్నాం అన్నారు. రైతు మొహంలో ఆనందం, పెదాలపై చిరునవ్వు చూస్తున్నాం అన్నారు. పట్టుబట్టి తెలంగాణకు మిషన్ భగీరథ నీళ్లిచ్చిన ఘనుడు కేసీఆర్. ఏటా 5 వేల కోట్లిస్తాం, వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ప్రాణం పోయినా మీటర్లు పెట్టమని కేంద్రానికి కేసీఆర్ తెగేసి చెప్పిండన్నారు.వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గిరిజన వర్సిటీ దిక్కులేవు. ఉన్నవాటిని అమ్మడానికి బీజేపీ చూస్తోంది. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలని చూస్తుందన్నారు.
డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నారు.సామాన్య, మధ్యతరగతి ప్రజలను దోచుకోవడమే బీజేపీ లక్ష్యం అని ఆరోపించారు హరీష్.
ఎన్నికల ముందు తక్కువ చెప్పి, ఎక్కువ పని చేస్తం….రు. 500 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు మహిళా సంఘాలకు అందిస్తాం. అభయ హస్తం డబ్బులు తిరిగి మహిళలకు అందిస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, సత్యవతి రాథోడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ధర్మా రెడ్డి, పెద్ధి సుదర్శన్, ఆరూరి రమేష్, వెంకట రమణా రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, Tsmsidc ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.