నిర్మల్‌లో రూ.40 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రి: హరీష్‌ రావు

63
harish
- Advertisement -

నిర్మల్ జిల్లాలో రూ. 40 కోట్లతో నిర్మించే నూతన జిల్లా ఆసుపత్రి భవనానికి శంకుస్ధాపన చేశారు మంత్రి హరీష్ రావు.ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్…280 పడకల ఆసుపత్రి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మీరు అడుగుతున్నట్లు సీఎం గారు ఇక్కడ మెడికల్, నర్సింగ్ కాలేజీ ఇస్తారనే నమ్మకం నాకూ ఉందన్నారు.మెడికల్ కాలేజీకి ఏర్పాటుకు మొదటి మెట్టు ఈ ఆసుపత్రి ప్రారంభం అన్నారు.

ఏ ఎన్ ఎం, ఆశాలు కరోనా సమయంలో ఎంతో కష్టపడ్డారు. మీకు అభినందనలు. రాష్ట్ర హైకోర్టు సైతం కరోనా మూడో వేవ్ లో తెలంగాణ పనితీరును మెచ్చుకుంది. నీతి అయోగ్ కూడా మెచ్చుకుందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆశల జీతాలు తక్కువగా ఉండేవి. పెంచాలని రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేసేవారు. నాటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించాయన్నారు. ఇనుప కంచెలతో అడ్డుకున్నాయి….కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత జీతాలు పెంచారు. 2014 ముందు రు. 1500 ఉంటే.. 6000 వేలకు పెంచారు. అడగకుండానే మళ్ళీ 30 శాతం పెంచి ఇప్పుడు రు. 9750 ఇస్తున్నామన్నారు.

మరింత బాగా పని చేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని 27 వేల మందికి స్మార్ట్ ఫోన్ కూడా ఇచ్చాము. ఒకపుడు ఆశాలు అంటే చిన్నచూపు.. ఇప్పుడు గౌరవం పెరిగిందన్నారు. బాగా పని చేద్దాం. ప్రజల కోసమే మనం ఉన్నాము. మనం అందరం ప్రజలకు సేవకులం అన్నారు. డెలివరీ విషయంలో ఆశాలు మరింత దృష్టి సారించాలి. గర్భం దాల్చిన తర్వాత రెగ్యులర్ గా చెకప్స్ చేయించాలి. ఎనీమియా బారి నుండి గర్భిణులను కాపాడాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలి. సాధారణ డెలివరీలు ఎక్కువ జరిగేలా చూడాలన్నారు.

- Advertisement -