సిద్దిపేట బస్టాండ్‌ను తనిఖీచేసిన హరీశ్..

103
harishrao
- Advertisement -

సిద్దిపేట బస్టాండ్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు మంత్రి హరీశ్‌ రావు. బస్టాండు ఆవరణలో ప్రయాణీకులకు అందే సౌకర్యాలు, ముఖ్యంగా కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు, తదితర వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

చిన్నపిల్లల తల్లులకు ఫీడింగ్ రూమ్ గదిని ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికార యంత్రాంగానికి ఆదేశించారు. బస్సుల రాకపోకలు, అన్నీ గ్రామాలకు బస్సులు వెళ్లేలా విద్యార్థుల సౌలభ్యం కోసం అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికార యంత్రాంగానికి సూచించారు. బస్టాండు ఆవరణ ప్రాంతాన్ని కలియతిరిగి క్షుణ్ణంగా మంత్రి పరిశీలించారు.

- Advertisement -